కరీంనగర్‌స్పోర్ట్స్: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ పరిధిలోని మై భారత్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతోందని ఉమ్మడి జిల్లా యువజన అధికారి గోలి తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం మై భారత్ కార్యాలయంలో మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరిగే జాతీయ యువజనోత్సవంలో 15 నుంచి 29ఏళ్ల మధ్య వయసు కలిగిన యువతీ యువకుల నుంచి కరీంనగర్ జిల్లా మై భారత్ కార్యాలయం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ డిజిటల్ క్విజ్, వ్యాస రచన, జిల్లా స్థాయి ప్రజెంటేషన్, రాష్ట్ర స్థాయి డైలాగ్, న్యూఢిల్లీలో జరిగే నేషనల్ గ్రాండ్ ఫినాలే వరకు బహుళ దశల్లో పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన ప్రతినిధులు 2027 జనవరి 10 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి కలిగిన కరీంనగర్ జిల్లా యువతీ యువకులు మై భారత్ అధికారిక పోర్టల్ ద్వారా తమ పేరు, పుట్టిన తేదీ, జిల్లా వివరాలతో సైన్‌అప్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, అనంతరం లభించే ఐడీ ద్వారా క్విజ్, పోటీల్లో పాల్గొనవచ్చునని అన్నారు. జిల్లా కార్యక్రమ అధికారి జి.కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
యువత ఆలోచనలకు జాతీయ వేదిక
ఉమ్మడి జిల్లా యువజన అధికారి గోలి తిరుపతి రెడ్డి


