గణేశ్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

జగిత్యాల: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నా రు. కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్‌కుమార్‌, అధికారులతో కలిసి మంగళవారం సమీక్షించారు. గణేశ్‌ మండపాలకు విద్యుత్‌ సరఫరా చేస్తామని, నిమజ్జన పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా వేస్తామని తెలిపారు. ఉత్సవ కమిటి సభ్యులు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్‌, వైద్య, అగ్నిమాపక, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బారికేడ్లు, క్రేన్లు, తాగునీరు, లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద మెడికల్‌ క్యాంప్‌ ఉండాలని, 108 వాహనం, పాముకాటు నివారణ మందులు అందుబాటులో ఉంచాలన్నారు. గజ ఈతగా ళ్లను షిఫ్ట్‌ల వారీగా నియమించాలన్నారు. ఎస్పీ మా ట్లాడుతూ ఈనెల 23, 24తేదీల్లో గణేశ్‌ నిమజ్జనా నికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్‌ పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ పకడ్బందీగా చేపట్టాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. అనామలిస్‌, నోమ్యాపింగ్‌ ఓటర్లపై సమీ క్షించారు. హియరింగ్‌ సమయంలో ఓటర్లు సమర్పించే ఆధారాలు, వివరాలు సమగ్రంగా పరిశీలించాలని, అర్హుల పేరు తొలగించొద్దని సూచించారు.

ఈవీఎం గోదాముల తనిఖీ

ఈవీఎం గోదాముల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్‌ అన్నారు. ధరూర్‌ క్యాంప్‌లోని ఈవీఎం గోదాంలను రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. సిబ్బంది ఈవీఎంలు వీవీప్యాట్‌ల భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ లత, ఆర్డీవో మధుసూదన్‌, అర్బన్‌ తహసీల్దార్‌ రాంమోహన్‌, జ్యోతి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement