కోరుట్ల: బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ గేటు వద్ద దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వ కుంట్ల విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అ నంతరం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ మాజీ మంత్రులైన సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చే స్తోందని ఆరోపించారు. మార్క్‌ఫెడ్ మాజీ అధ్యక్షు డు లోక బాపురెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచులు,కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


