సీజనల్‌ వ్యాధులు నివారించాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులు నివారించాలి

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

● డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌

పెగడపల్లి: సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం, తిరుమలాపూర్‌ ఆయుష్మాన్‌ ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. సిబ్బంది పనితీరు, వైద్య సేవలు, మందుల నిల్వలు, హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. వైద్య సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని సూచించారు. వైద్యాధికారి నరేశ్‌, సీహెచ్‌వో సందీప్‌, హెచ్‌వీలు జయశీల, జ్యోతి, సిబ్బంది మౌనిక, లక్ష్మీ, భాస్కర్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement