పెరుగుతున్న హైరిస్క్ కేసులు వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు ప్రసవ సమయంలో గర్భిణులకు ఇబ్బందులు ఒక్కోసారి తల్లీబిడ్డల ప్రాణాలకే ముప్పు
గర్భం దాల్చినప్పటి నుంచే ప్రతినెల స్కానింగ్ చేయించుకోవాలి.
తల్లీబిడ్డ ఎలా ఉన్నారో తరుచూ చూసుకోవాలి.
తల్లికి బీపీ, రక్తహీనత, వైద్యులు సూచించిన మందులు వాడితేనే ఆరోగ్యకరంగా ఉంటారు.
కొందరు మహిళలు ఇలాంటివేమీ పట్టించుకోకపోవడంతో బీపీ పెరగడం, స్కానింగ్ తీయించుకోకపోవడంతో గర్భంలో శిశువు ఎలా ఉందన్నది తెలియక ముందే ప్రసవం జరిగి తల్లిబిడ్డకు ముప్పు వాటిల్లుతుంది.
వైద్యులు హైరిస్క్ అని గుర్తించిన వెంటనే మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లే జరుగుతున్నాయి. సిజేరియన్‌తో మహిళల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. ప్రతి ఆస్పత్రిలో సిజేరియన్లే ఎక్కువగా అవుతుండడంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానానికి చేరి ఆందోళన కలిగిస్తోంది.
బరువు తక్కువగా ఉన్నా...
గర్భిణులు బరువు తక్కువగా ఉన్నా హైరిస్క్‌గా గుర్తిస్తారు. 18 ఏళ్లలోపు, 35ఏళ్లపైబడి గర్భం దాల్చిన మహిళలు హైరిస్క్‌లోకి వెళ్తారు. చిన్న వయస్సులో అయితే శారీరక ఎదుగుదల లేకపోవడం, పెద్ద వయస్సులో అయితే గర్భధారణ సమస్యగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో 18 ఏళ్లలోపు, 35 ఏళ్ల పైబడిన వారిని 159మందిని గుర్తించారు. అలాగే ఊబకాయం, అధిక బరువు ఉన్న వారు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు.
పోషకాహారం లేకనే..
మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పోషకాహా రం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. గ్రామీ ణప్రాంతాల్లో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఉప్పు అధికంగా తీసుకోవడం ద్వారా హైరిస్క్‌లోకి వెళ్తున్నారు. గ్రామీణులకు అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందిస్తుంటారు. కానీ.. దానిని కొందరు తీసుకోకపోవడంతో సమస్యలు ఎదుర్కోవా ల్సి వస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, పండ్లు, గుడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి భోజనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమయపాలన పాటించకపోతే పోషకాహార లోపంతో బిడ్డ 9 నెలలు నిండకముందే తక్కువ బరువుతో జన్మించే అవకాశం ఉంటుంది. వీరికి గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మార్పు రాకపోవడంతో హైరిస్క్ కేసులు పెరుగుతున్నాయి.
జగిత్యాల: హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గర్భధారణ సమయంలో వివిధ అనారోగ్య సమస్యలు రావడంతో ప్రసవం సమయంలో ప్రాణాలకే ముప్పు వస్తోంది. ఒకానొక దశలో తల్లితోపాటు, శిశువులూ మృత్యువాత పడిన ఘటనలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 5,884 మంది హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి గర్భం దాల్చినప్పటి నుంచే మహిళలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతినెలా చెకప్ చేయించుకోవడంతోపాటు డాక్టర్ సలహాలు తప్పనిసరిగా పాటించాలి. సాధారణంగా 6, 8వ నెల వచ్చేసరికి బీపీ, షుగర్ రావడం.. హైపర్ టెన్షన్.. డయాబెటిస్.. థైరాయిడ్ వంటి సమస్యలు వస్తుంటాయి. ఆ సమయంలో డాక్టర్లు ఎకై ్సర్‌సైజ్‌లు చేయిస్తుంటారు. వీటిని గర్భిణులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సిందే. అయితే గ్రామీణప్రాంతాల మహిళల్లో ఎక్కువగా అవగాహన లేకపోవడంతో గర్భధారణ తర్వాత పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో బలహీనతగా మారి ప్రసవ సమయంలో ఇబ్బందిపడటంతోపాటు కొన్నిసార్లు మృత్యువాత పడిన సంఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. మొదటి కాన్పులో సిజేరియన్ అయితే రెండో కాన్పులో అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్లీ సిజేరియన్ చేయాల్సి వస్తే అది హైరిస్క్‌గా మారుతుంది. ప్రసవం చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
పర్యవేక్షణ అవసరం
పరీక్షలు చేయించుకోవాలి
గర్భం దాల్చిన మహిళా ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సరైన పౌషకాహారం తీసుకోవాలి. పరీక్షలు చేయించుకుంటే తల్లీబిడ్డ ఎలా ఉన్నారన్నది తెలుస్తుంది. దానిని బట్టి వైద్యులు మందులు రాస్తారు. 9 నెలలు నిండే వరకు ప్రతినెల స్కానింగ్ చేయించుకోవాలి. – జైపాల్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో


