కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి | - | Sakshi
Sakshi News home page

కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

జగిత్యాలజోన్‌: రోడ్డు ప్రమాదాల పరిహారం కేసులు అత్యధికంగా పరిష్కారం అయ్యేలా ఇన్సూరెన్సు సంస్థలు చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో మంగళవారం ఇన్సూరెన్సు కంపెనీల న్యాయవాదులు, ప్రతినిధులతో సమీక్షించారు. కేసులు వేసినవారు, ఇన్సూరెన్స్‌ సంస్థలు సయోధ్య కుదుర్చుకోవాలన్నారు. మానవత దృక్పథంతో కేసులు పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, కటుకం చంద్రమోహన్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీ న్యాయవాదులు పాల్గొన్నారు.

కల్తీ ఎరువులు అమ్మితే కేసులు

రాయికల్‌: ఫర్టిలైజర్‌ దుకాణాల్లో కల్తీ ఎరువులు అమ్మితే సదరు దుకాణాలపై కేసులు నమో దు చేసి సీజ్‌ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌ సూచించారు. మంగవారం రా యికల్‌ పట్టణంతోపాటు మండలంలోని వివిధ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. రిజి ష్ట్రర్లు, బిల్‌బుక్‌లు పరిశీలించారు. తప్పనిసరి గా రిజిస్టర్లు వివరాలు పొందుపర్చాలని సూ చించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి ముక్తేశ్వర్‌, ఏఈవో నరేశ్‌ పాల్గొన్నారు.

12న లోక్‌ అదాలత్‌

జగిత్యాలజోన్‌: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మట్ట సరిత తెలిపారు. జిల్లా కోర్టులో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాజీ చేసుకోదగ్గ కేసులన్నింటినీ లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇరువర్గాల రాజీతో కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్నారు. సివిల్‌, క్రిమినల్‌, మోటార్‌వాహనాలు, కుటుంబ తగాదాల కేసులు పరిష్కరిస్తామని వివరించారు. సమాచారం కోసం న్యాయ సేవా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గృహ నిర్బంధం

జగిత్యాలక్రైం: ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసానికి బయల్దేరిన జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంతను మంగళవారం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డికి పాలన చేతకాక రౌడీరాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ తెలంగాణ సాధించినందుకు చావుడప్పు కొట్టారా..? తెలంగాణను ప్రపంచచిత్రపటంలో మొదటి స్థానంలో నిలిపినందుకా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి పాలనకు చరమగీతం పాడుతారన్నారు. కేసీఆర్‌ ఇంటి గేట్‌ తాకినా ప్రజలంతా అగ్గిలా మండుతారని తెలిపారు.

బీర్‌పూర్‌ నృసింహస్వామి ఆలయ ఈవోగా కిరణ్‌

జగిత్యాలరూరల్‌: బీర్‌పూర్‌లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవోగా కొడిమ్యాల మండలం నల్లగొండలోగల శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవోగా పనిచేస్తున్న బి.కిరణ్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఈవో శ్రీనివాస్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement