జగిత్యాల: ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లకు ఇప్పటివరకు జిల్లాలో 15 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నవారు వితంతువులే ఉన్నారు. దరఖాస్తులకు ఆగస్టు 31 వరకే చివరి తేదీ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఈనెల 15 వరకు పెంచారు. ఈ క్రమంలో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. గడువులోపు అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాని డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్ సూచించారు.
కేటగిరీల వారీగా వచ్చిన
మొత్తం దరఖాస్తులు 15,032
వితంతువులు 6,071
ఒంటరి మహిళలు 1,317
దివ్యాంగులు 2,424
చేనేత 2,435
కల్లుగీత కార్మికులు 2,165
పైలేరియా 560
డయాలసిస్ 60


