ధర్మపురి:పురావస్తుశాఖ అనుమతి రాగానే ధర్మపురిలో యోగానంద స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శ్రీఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని మంత్రి పరిశీలించారు. వందేళ్ల వరకు భక్తుల అవసరాలకు తగినట్లు ఆలయ నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు.
వెయ్యి రోజుల విజయోత్సవ ర్యాలీ
ముందుగా మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ వెయ్యిరోజుల పాలన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పటేల్, గాంధీ, నందీ చౌక్‌ల మీదుగా నిర్వహించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి ప్రజల మన్ననలు అందుకున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, నాయకులు వేముల రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం
ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు. ఆదివారం ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం చేయగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం మండల, పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికై న సాయిని శ్రీనివాస్, పెన్న శ్రీనివాస్ ప్రమాణం చేశారు. వారిని మంత్రి సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట నాయకులు, వివిధ జిల్లాల నాయకులు ఉన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
వెల్గటూర్: మండలంలోని పాషిగాంలో ఏర్పాటు చేసిన గమ్యం హోటల్‌ను మంత్రి ప్రారంభించారు. ధర్మపురి, కోటిలింగాల, గూడెంగుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలన్నారు.


