హామీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

● బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌ రెడ్డి

జగిత్యాలరూరల్‌: కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో రేవంత్‌ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పిలుపు మేరకు పల్లెల విధ్వంసం, పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జెడ్పి మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి బీర్‌పూర్‌ మండలకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం చూస్తోందన్నారు. కేసీఆర్‌ హయాంలో డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడామైదానాలు ఏర్పాటు చేశారని అన్నారు. కాంగ్రెస్‌ మూడేళ్లలో కొత్తవి లేకపోగా.. కేసీఆర్‌ పథకాలు అమలు కావడం లేదన్నారు. రోళ్లవాగు తెగిపోయి చేపలు కొట్టుకుపోయినా పరిహారం ఇవ్వలేదని, ఊరూరా బెల్ట్‌ షాపులతో గీతాకార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. గుట్టలు తవ్వుతూ, ఇసుక అక్రమ రవాణా చేస్తూ పల్లెలను విధ్వంసం చేస్తున్నారని తెలిపారు. హరిచరణ్‌రావు, మసర్తి రమేశ్‌, సుభాష్‌యాదవ్‌, ముక్క శంకర్‌, కొల్ముల రమణ, జితేందర్‌ యాదవ్‌, లక్ష్మణ్‌రావు, తేలు రాజు, బర్కం మల్లేషం, బైరి మల్లేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement