ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 7న చేపట్టనున్న శ్రీఉగ్ర నృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు ధర్మపురికి చేరుకుంటారని, సోమవారం వేకువజామున 2.30 గంటలకు ఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం పర్యటను విజయవంతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు.
MýS*Æý‡-V>Ķæ$ÌS ç³…rÌSOò³ §ýl–íÙt ÝëÇ…^éÍే
జగిత్యాలరూరల్: కూరగాయల పంటలపై దృష్టి సారించాలని పొలాస శాస్త్రవేత్తలు తెలిపారు. ‘ఆత్మ’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు, ఆర్‌ఏఆర్‌ఎస్ పొలాస శాస్త్రవేత్తలు సారంగాపూర్ మండలం పెంబట్లలో సాగవుతున్న సన్నరకాల పంటలను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల పరిస్థితి, యాజమాన్య పద్ధతులను పరిశీలించి, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడలు, తెగుళ్ల నియంత్రణపై సూచనలు అందించారు. కూరగాయల పంటలు, పూలతోటలను సందర్శించారు. చీడపీడలు, తెగుళ్ల పరిస్థితిపై రైతులతో చర్చించారు. అవసరమైన సాంకేతిక సలహాల కోసం సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో ప్రదీప్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,రైతులు పాల్గొన్నారు.


