కథలాపూర్: మండలంలోని తాండ్య్రాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుండు విజయ్ రాష్ట్రస్థా యి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును శనివారం అందుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవంలో వి ద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణా విజ య్‌కి అవార్డును ప్రదానం చేశారు. విజయ్‌ని మండల అధికారులు, ఉపాధ్యాయులుఅభినందించారు.
సీఎం చేతుల మీదుగా..
మల్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల ప్రిన్సిపాల్ మోతె శివరామకృష్ణ శనివారం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. కళాశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో చొరవ తీసుకోవడం, సబ్జెక్టులవారిగా వెనకబడిన వారిని గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాల సాధనకు చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు అందుకున్నారు. కళాశాల అధ్యాపకులు శివరామకృష్ణకు అభినందనలు తెలిపారు.


