ధర్మపురి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో శనివారం వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కొప్పుల మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించక విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇప్పటికి రూ.14వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు రూ.300 కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. కేసీఆర్ పాలనలో ఏర్పాటుచేసిన గురుకులాలను నిర్వీర్యం చేసి యంగ్ ఇండియా మోడల్ స్కూల్ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహం నుంచి నంది, గాంధీ కూడలీ మీదుగా ర్యాలీ నిర్వహించారు. నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, అయ్యోరి రాజేశ్, వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.


