● అదనపు కలెక్టర్‌ లత | - | Sakshi
Sakshi News home page

● అదనపు కలెక్టర్‌ లత

Sep 6 2026 1:55 AM | Updated on Sep 6 2026 1:55 AM

● అదనపు కలెక్టర్‌ లత

జగిత్యాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ లత తెలిపారు. ప్రచార కార్యక్రమాలను ప్రారంభించామని, ఆదివారం జిల్లాలోని ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతామని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాను ప్రజలు తమ సంబంధిత ఓటును పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలించుకోవాలన్నారు. అర్హులైన వారు కొత్తగా ఓటరు నమోదుకు ఫారం 6, పేర్ల తొలగింపు అభ్యంతరాల కోసం ఫారం 7, ఓటరు జాబితాలోని వివరాల సవరణ, చిరునామా మార్పు కోసం ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎల్వోలు పోలింగ్‌ కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్హులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement