వెల్గటూర్: ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త విజయ్ భాస్కర్ అన్నారు. ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ ఎరువుల వాడకంపై వివరించారు. పడకల్, కొత్తపేట, రాజారాంపల్లి గ్రామాల్లో వరి, పత్తి, పసుపు పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి రైతులకు ఆయా పంటలలో అనుసరించాల్సిన సాగు యాజమాన్య పద్ధతులు వివరించారు.


