కనిపించని మెుక్కలు | - | Sakshi
Sakshi News home page

కనిపించని మెుక్కలు

Sep 6 2026 1:55 AM | Updated on Sep 6 2026 1:55 AM

● వన మహోత్సవం కింద మొక్కలు నాటడానికి మున్సిపాలిటీ ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తోంది. ● నాటడానికి అవసరమైన మొక్కల కోసం రేగుంట శివారులోని ఎస్సారెస్పీ స్థలంలో ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేశారు. అందులో ఏటా సుమారు 50వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. ● నర్సరీలో పనులు చేయడం కోసం ఏడాది క్రితం వరకు 16 మంది ఉండగా.. ప్రస్తుతం ఆరుగురు సేవలందిస్తున్నారు. ● మొత్తంగా సిబ్బందికి వేతనాలతోపాటు ఇతరవాటికి ఏటా రూ.25 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ● ఏటా నర్సరీలో పెంచిన మొక్కలనే నాటడంతో పాటు ప్రజలకు పంపిణీ చేస్తూ వస్తున్న అధికారులు.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.15.66లక్షలతో వివిధ రకాల 15,100 మొక్కలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ● నర్సరీలో అప్పటికే సుమారు 20వేల మొక్కలు ఉండగా.. అదనంగా మొక్కల కోసం ఇన్ని రూ.లక్షలు ఖర్చు చేయడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ● ప్రస్తుతమున్న మున్సిపల్‌ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉన్న మొక్కలతో సరిపెట్టకుండా అధికారులు ఇంత పెద్ద మొత్తం వెచ్చించడం విమర్శలకు తావిస్తోంది.

మెట్‌పల్లి మున్సిపాలిటీలో నామమాత్రంగా వన మహోత్సవం ఏటా నాటుతున్న మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం పెద్ద ఎత్తున ప్రజాధనం వృథా అధికారుల తీరుపై విమర్శలు

రూ.లక్షలు వెచ్చించి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో మొక్కలు నాటుతున్న అధికారులు వాటి సంరక్షణపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు.

ప్రారంభంలో మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా వాటికి నీరు. పట్టారు. ఫలితంగా అవి ఏపుగా ఎదిగాయి.

తర్వాత సంరక్షణ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల నాటిన మొక్కలు కొన్ని రోజులకు కనిపించకుండా పోతున్నాయి.

తద్వారా రూ.లక్షల ప్రజాధనం వృథా కావడమే కాకుండా పట్టణంలో పచ్చదనం పెంపొందే అవకాశం లేకుండా పోతోంది.

లక్షల్లో ఖర్చు..

పర్యావరణ పరిరక్షణతోపాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం మెట్‌పల్లి ము న్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వ డం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం కింద ఏటా వేల సంఖ్యలో వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. తర్వాత వాటి సంరక్షణపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో నాటిన వాటిల్లో ఎక్కువశాతం మొక్కలు ఎండిపోతున్నాయి. దీనివల్ల పచ్చదనాన్ని పెంపొందించాలనే ప్రభుత్వం ఆశయం నీరుగారిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏటా రూ.లక్షల ఖర్చు

అదనంగా రూ.15.66

లక్షలతో కొనుగోలు

మెట్‌పల్లి: ఈ చిత్రం మెట్‌పల్లి పట్టణంలోని 8వార్డు శివారులో ఉన్న ప్రకృతి వనం. మున్సిపాలిటీకి చెందిన ఈ స్థలంలో వనమహోత్సవం కింద చుట్టూ కంచె నిర్మించారు. అందులో మొక్కలు నాటారు. వాటికి నీరు అందించేందుకు ప్రత్యేకంగా బోరు, డ్రిప్‌ ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించారు. కొంతకాలంపాటు సంరక్షణ చర్యలు తీసుకోవడంతో మొక్కలు ఎదిగి ప్రకృతి వనంలో పచ్చదనం పెంపొందడానికి దోహాదపడింది. తర్వాత నిర్లక్ష్యం చూపడంతో మొక్కలు ఎండిపోయి.. కంచె తొలగిపోయి అధ్వానంగా తయారైంది.

సంరక్షణ చర్యలు అంతంతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement