కథలాపూర్(వేములవాడ): 2026 ఏడాదికి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై న జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గుండు విజయ్ 2008లో ఉద్యోగంలో చేరాడు. మండలంలోని సిరికొండ, అంబారి పేట పాఠశాలల్లో పనిచేశాడు. 2018లో తాండ్య్రాలకు బదిలీపై వచ్చారు. అప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 90మంది విద్యార్థులు ఉండగా, గతేడాది సంఖ్య 153కు పెరిగింది. ప్రీ ప్రైమరీకి అనుమతి రావడంతో ఈసారి ప్రవేశాలు పెరిగి 176 మంది చదువుతున్నారు. విజయ్ ప్రీ ప్రైమరీ తరగతికి పుస్తకాలు రూపకల్పన చేసి, ఎఫ్‌ఎల్‌ఎన్‌లో 90శాతం ఫలితాలు సాధించడంతో అధికారుల మెప్పు పొందాడు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తూ, విద్యార్థులు సెల్‌ఫోన్ ద్వారా సమాధానాలు రాసేలా వర్క్‌షీడ్ తయారు చేశాడు.


