పాఠ్య పుస్తకాల తయారీలో.. | - | Sakshi
Sakshi News home page

పాఠ్య పుస్తకాల తయారీలో..

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

పాఠ్య పుస్తకాల తయారీలో..

చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.విజయలక్ష్మి బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ రూపొందించే పాఠ్య పుస్తకాల ప్రణాళిక కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డును ఈనెల 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదగా అందుకోనున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం మరింత అంకితభావంతో పని చేస్తానని విజయలక్ష్మి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement