కథలాపూర్: జిల్లాలో ఎస్జీఎఫ్ పోటీల సందడి నెలకొననుంది. డీఈవో, డీవైఎస్‌వో, పీడీలు, పీఈటీలు, క్రీడా సంఘాల బాధ్యుల సహకారంతో పాఠశాలస్థాయి క్రీడలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎస్జీఎఫ్ షెడ్యూల్ ప్రకటించారు. అండర్–11, 14, 17, 19 విభాగాల్లో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈనెల11లోపు
మండలస్థాయి పోటీలు పూర్తి
మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. మండలస్థాయిలో ఈనెల 11లోపు పోటీలు పూర్తవుతాయి. మండల స్థాయిలో రాణించిన వారు జిల్లాకేంద్రంలో నిర్వహించే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో సత్తాచాటిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి క్రీడలను ఈనెల 30లోపు పూర్తి చేస్తామని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి చక్రధర్‌రావు వివరించారు.


