కోరుట్ల: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ గురువారం మల్లాపూర్ మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదని, రైతుబంధు, రైతుబీమా ఎగ్గొట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సాగునీటి రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పలువురు సర్పంచులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


