‘ఇంటిగ్రేటెడ్‌’ పనుల్లో వేగం | - | Sakshi
Sakshi News home page

‘ఇంటిగ్రేటెడ్‌’ పనుల్లో వేగం

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: వచ్చే విద్యాసంవత్సరం వరకు ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనుల్లో వేగం పెంచుతున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం తాటిపల్లి శివారులో 25ఎకరాల్లో నిర్మించనున్న యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులను గురువారం పరిశీలించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో అందించడం లక్ష్యమన్నారు. 2500 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, సర్పంచులు గంగారెడ్డి, కట్ట రాజేందర్‌, నాయకులు నక్కల రవీందర్‌రెడ్డి, సదానందం, నలువాల సురేశ్‌, సతీశ్‌, లింగారెడ్డి, గంగారెడ్డి, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగులను మోసం చేస్తున్న సీఎం

ఈనెల 10న చలో హైదరాబాద్‌

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్‌

జగిత్యాలరూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాక ఉద్యోగులను మోసం చేస్తోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్‌ అన్నారు. జగిత్యాలరూరల్‌ మండలం మోరపల్లి, పొరండ్లతోపాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్టీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు. వంద రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని, పెండింగ్‌ డీఏలు మంజూరు చేస్తామని, సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాక విస్మరించారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 10న నిర్వహించే నిరసన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. రాష్ట్ర అదనపు కార్యదర్శి మచ్చ శంకర్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్‌, అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎగ్యారపు వెంకటేశ్‌, మండల అధ్యక్షుడు విష్ణు పాల్గొన్నారు.

శిశుమరణాలు తగ్గించాలి

డీఎంహెచ్‌వో సుజాత

జగిత్యాల: జిల్లాలో శిశుమరణాలు లేకుండా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. శిశుమరణాలను సింగిల్‌ డిజిట్‌కు తీసుకురావాలని, గర్భిణులకు మొదటి నుంచే అవగాహన కల్పించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, వైద్యులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

ధర్మపురి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని డీఆర్‌డీవో రఘువరణ్‌, పీపీవో మదన్‌మోహన్‌ అన్నారు. నవ వసంతోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలోని రాయపట్నంలో ఎంపీడీవో రవీందర్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ వంతుగా మొక్కను నాటి సంరక్షించాలన్నారు. సర్పంచ్‌ మొగిలి, ఉప సర్పంచ్‌ చిలుక రామన్న, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement