ధర్మపురి: ‘పదేళ్లలో మీ అవినీతి.. వెయ్యి రోజుల్లో మా అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురండి..’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ చేసిన అప్పులతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అధికారంలోకొచ్చిన తర్వాత 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. ధర్మపురి లక్ష్మినృసింహునికి నిధులు మంజూరు చేస్తామని శఠగోపం పెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. వెయ్యిరోజుల పాలనపై ఆరోపణలు చేసిన మాజీమంత్రి కొప్పులకు వెయ్యి రోజుల ప్రగతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ధర్మపురిలో డిగ్రీ కళాశాల, రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, బస్‌డిపో, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేశ్, నాయకులు చీపిరిశెట్టి రాజేష్, చిలుముల లక్ష్మణ్, కుంట సుధాకర్ ఉన్నారు.
సంక్షేమ పాఠశాలల్లో కార్పొరేట్ సౌకర్యాలు
వెల్గటూర్: సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.67 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తహసీల్దార్, ఎంపీడీవోలు వారంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాలను తనిఖీ చేయాలని, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించాలని ఆదేశించారు. ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సర్పంచ్ జక్కుల ఆమని, ఆర్డీవో మధుసూదన్, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, తహసీల్దార్ శేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, నాయకులు మురళి, ఉదయ్, శ్రీకాంత్‌రావు, నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
అసెంబ్లీకి కేసీఆర్‌ను తీసుకురావాలి
కేటీఆర్, హరీశ్‌రావుకు మంత్రి అడ్లూరి సవాల్


