రాహుల్‌గాంధీపై కేసు ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రాహుల్‌గాంధీపై కేసు ఉపసంహరించుకోవాలి

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

కోరుట్ల: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ శ్రేణులు గురువారం పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ రాహుల్‌పై ఉత్తరఖాండ్‌ పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. శ్రీఎస్‌ఐఆర్‌శ్రీ కార్యక్రమంలో పాలొన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభాస్థలాన్ని బీజేపీ శ్రేణులు గంగాజలంతో శుద్ధి చేసి కించపరిచారని, దీనిపై రాహుల్‌ మాట్లాడటాన్ని తప్పుపట్టి కేసు నమోదు చేయటం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరుమల వసంత, కాంగ్రెస్‌ పట్టణ, మండల అధ్యక్షుడు గంగాధర్‌ గౌడ్‌, పన్నాల అంజిరెడ్డి, నాయకులు కొంతం రాజం, పలువురు సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

కోరుట్లలో కాంగ్రెస్‌ శ్రేణుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement