అంగన్‌వాడీ పోస్టులపై దళారుల కన్ను | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ పోస్టులపై దళారుల కన్ను

Sep 4 2026 2:00 AM | Updated on Sep 4 2026 2:00 AM

జగిత్యాల: అంగన్‌వాడీ కేంద్రాల్లోని 64పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రావడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమైంది. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల్లో 1085 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 64 పోస్టులకు 1199 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఈనెల ఐదో తేదీ వరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే పోస్టుల భర్తీలో దళారుల కన్ను పడింది. అభ్యర్థుల నుంచి డబ్బులు దండుకోవడానికి పోస్టులు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. జగిత్యాల, ధర్మపురి, మల్యాల, మెట్‌పల్లిలో అత్యధిక మంది పోటీ పడుతుండడం వీరికి కలిసివస్తోంది. దళారులను నమ్మి మోసపోవద్దని, అర్హతను బట్టే పోస్టులు వస్తాయని సీ్త్ర సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నా.. ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని కొందరు పైరవీలు చేస్తున్నారు. తమకు ప్రజాప్రతినిధులు తెలుసునని, ఎమ్మెల్యే, మంత్రితో చెప్పి పోస్ట్‌ ఇప్పిస్తామని చెబుతుండడంతో వారి వలలో పడుతున్నారు.

నేతల చుట్టూ ప్రదక్షిణలు

అంగన్‌వాడీ పోస్టులకు మొదటి నుంచి డిమాండ్‌ ఉండటంతో చిన్నచిన్న లీడర్లు ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఓ ప్రజాప్రతినిధి పీఏ ఏకంగా రూ.4 లక్షలు డిమాండ్‌ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాకేంద్రంలో అన్‌రిజర్వ్‌డ్‌ పోస్టులు ఉండటంతో పైరవీలు తీవ్రతరంగా మారాయి. అధికారపార్టీకి చెందిన బడా నాయకుల వద్దకు నిత్యం వెళ్తూ పోస్టులు ఇప్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో పోస్ట్‌కు సుమారు రూ.5 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

జోరుగా సాగుతున్న పైరవీలు

అంగన్‌వాడీ కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement