కోరుట్ల: కోరుట్ల మండలం మోహన్‌రావుపేట – మేడిపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మేడిపల్లి మండలకేంద్రానికి చెందిన దుమాల లక్ష్మణ్(24) మృతి చెందాడు. ఎస్సై శ్యాంరాజ్ కథనం ప్రకారం.. లక్ష్మణ్ కోరుట్లకు ఉపాధి కోసం ప్రతిరోజు మేడిపల్లి నుంచి వచ్చిపోతున్నాడు. ఎప్పటిలాగే తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా.. మోహన్‌రావుపేట బ్రిడ్జి దాటగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేశామని, ద్విచక్రవాహన్ని ఢీకొట్టిన వాహనం కోసం గాలింస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఇసుక టిప్పర్ పట్టివేత
ఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట వద్ద గురువారం ఇసుక టిప్పర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. కథలాపూర్ మండలం నుంచి అమ్మక్కపేటకు అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తుండగా టిప్పర్‌ను పట్టుకున్నామని పేర్కొన్నారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి టిప్పర్ యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మృతదేహాన్ని తెప్పించాలని కేంద్రమంత్రికి వినతి
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్ ఇటీవల ఉక్రెయిన్‌లో జరిగిన రష్యా బాంబు దాడిలో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహాన్ని తెప్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను అతని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. స్పందించిన ఆయన ఉక్రెయిన్ రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా సమాచారం చేరవేశారు.
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
మెట్‌పల్లిరూరల్: ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడిన మెట్‌పల్లి మండలం మేడిపల్లికి చెందిన బోదాసు చిన్నరాజయ్య(35) చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌కు చెందిన చిన్న రాజయ్య మేడిపల్లిలో అద్దెకు ఉంటున్నాడు. ఈనెల ఒకటిన భార్య రాధతో చిన్నరాజయ్య గొడవ పెట్టుకుని రోడ్డుపైకి రాగా ఆటో ఢీకొట్టింది. చికిత్స నిమిత్తం మెట్‌పల్లి.. తరావ్త జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. మృతుడి సోదరుడు పెద్ద రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


