పెరోల్‌పై పీఎఫ్‌ఐ నాయకుడు | - | Sakshi
Sakshi News home page

పెరోల్‌పై పీఎఫ్‌ఐ నాయకుడు

Sep 3 2026 4:15 AM | Updated on Sep 3 2026 4:15 AM

జగిత్యాలక్రైం: దేశద్రోహం కేసులో మూడేళ్ల క్రితం ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేసిన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్‌ సలీం చిన్నమ్మ 15 రోజుల క్రితం మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సలీంకు కోర్టులో పెరోల్‌ మంజూరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య సలీంను జగిత్యాలకు తీసుకొచ్చారు. సుమారు మూడున్నర గంటల పాటు కుటుంబసభ్యులతో గడిపిన అనంతరం సలీంను పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. సలీం పెరోల్‌పై వస్తున్నాడని తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి

మూడున్నర గంటల తర్వాత జైలుకు తీసుకెళ్లిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement