గొల్లపల్లి: తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన పద్యాల పోటీల్లో మండలకేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న మొకిలి గౌతమ్ జిల్లాస్థాయికి ఎంపికయ్యాడు. పోతన, నన్నయ వంటి గొప్ప కవులు రాసిన పద్యాలను అవలీలగా చదవడమే కాకుండా న్యాయనిర్ణేతలు ఇచ్చిన పది పద్యాలను అనర్గళంగా రాగయుక్తంగా పాడినందుకు జిల్లా స్థాయికి ఎంపికయ్యాడు. ప్రిన్సిపల్ సుంకరి రవి విద్యార్థిని అభినందించారు. పాఠశాలలో విద్యతోపాటు, నోబ్యాగ్ డే స్పెషల్ ఆక్టివిటీస్, సంస్కృతి కార్యక్రమాలు, తెలుగు భాషను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో విద్యార్థులలో సజనాత్మకత, ఆలోచన విధానం పెంపొంది రాణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


