కొడుకు చేసిన అప్పులకు తండ్రి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

కొడుకు చేసిన అప్పులకు తండ్రి బలవన్మరణం

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

వెల్గటూర్‌: కొడుకు చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెందిన తండ్రి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఎండపల్లి మండలకేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన బొంగాని కిష్టయ్య గౌడ్‌ (79)కు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. రెండో కొడుకు అయిన బొంగాని సత్తయ్య కొన్నిరోజుల క్రితం గ్రామంలో కొంతమంది దగ్గర అప్పు చేసి ఎటో వెళ్లిపోయాడు. అప్పటినుంచి కొడుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ బాధపడుతున్నాడు. తీవ్ర మనస్తాపంతో బుధవారం తన ఇంటి వద్ద ఉరేసుకున్నాడు. కిష్టయ్య చిన్న కుమారుడు శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

అల్లీపూర్‌లో మరోసారి చోరీ

రాయికల్‌: రాయికల్‌ మండలం అల్లీపూర్‌లోని శివాలయం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. శివాలయంలోని హుండీ నుంచి రూ.30 వేలు, వేంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీల నుంచి రూ.30 వేల వరకు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల క్రితం రాయికల్‌లోని శివాలయం, హనుమాన్‌ ఆలయంలో చోరీకి పాల్పడిన వారే తాజాగా ఈ ఆలయాల్లో కూడా చోరీకి పాల్పడినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. పోలీసులు స్పందించి ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆస్పత్రి పై నుంచి దూకిన పేయింటర్‌ మృతి

సిరిసిల్లటౌన్‌: కడుపునొప్పి భరించలేక జిల్లా ఆస్పత్రి పై నుంచి దూకిన పేయింటర్‌ రాజు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన తిరుగింటి రాజు(38) కడుపునొప్పితో మంగళవారం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. రాత్రి వేళ నొప్పి భరించలేకనే ఆస్పత్రి భవనం పై నుంచి దూకినట్లు మృతుడి బంధువులు తెలిపారు. ఈక్రమంలో రాజు కాలు విరగడంతోపాటు శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.

మృతుడి భార్య గర్భిణీ

రాజు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతుడు రాజు పేయింటర్‌తోపాటు దినసరి కూలీగా పనిచేసేవాడు. భార్య కావ్య బీడీలు చుడుతూ ఇల్లు వెల్లదీస్తోంది. వీరికి మన్విత్‌(7) కొడుకు ఉండగా, ప్రస్తుతం కావ్య ఆరు నెలల గర్భిణీ. రాజు ఆత్మహత్యతో ఆ కుటుంబం రోడ్డున పడింది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణంలోని చైతన్యకాలనీకి చెందిన సయ్యద్‌ అబ్దుల్లా (50) అనే ఉల్లిగడ్డల వ్యాపారి బైక్‌పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో మరణించాడు. బుధవారం పనినిమిత్తం బైక్‌పై మంథని వెళ్లి తిరిగి వస్తుండగా రైల్వే ఫ్‌లై ఓవర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగిందని టౌన్‌ ఎస్సై నరేశ్‌ తెలిపారు. మృతుడి కుమార్తె సయ్యద్‌ హీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు.

వృద్ధురాలి ఆత్మహత్య

కోనరావుపేట(వేములవాడ): అనారోగ్యం, ఒంటరితనం భరించలేక లేక ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై బండారి రామ్మోహన్‌ తెలిపారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వంగపల్లి రాజవ్వ (80) కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఒంటరితనంతో బాధపడుతోంది. మృతురాలి భర్త రాజయ్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాజవ్వ కుమారుడు వంగపల్లి వెంకటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

రైస్‌మిల్లు సీజ్‌

సిరిసిల్ల అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండానే ఓ రైస్‌మిల్లు నుంచి సామగ్రి తరలిస్తుండగా సివిల్‌ సప్లయ్‌ అధికారులు అడ్డుకుని సీజ్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు శివారులోని మహేశ్వరి రైస్‌మిల్‌ రూ.128 కోట్ల బకాయి పడింది. వాటిని చెల్లించాలంటూ అధికారులు ఇటీవల నోటీసీలు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా యజమానులు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండానే మిల్లులోని యంత్రాలను ఇతరులకు విక్రయించుకున్నారు. ఆ సామగ్రిని బుధవారం తరలిస్తుండగా విషయం తెలుసుకున్న సివిల్‌ సప్లయ్‌ అధికారి బుచ్చిబాబు తన సిబ్బందితో చేరుకున్నారు. ప్రభుత్వానికి చెలించాల్సిన బకాయిపై యజమానిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో లారీలతోపాటు రైస్‌మిల్లును సీజ్‌ చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement