వేములవాడ: యూఏఈకి చెందిన ప్రముఖ ఏఎన్‌డీహెచ్ క్యాటరింగ్ సంస్థలో 300 కంటే ఎక్కువ క్లీనర్ ఉద్యోగాల భర్తీకి ఉచిత రిక్రూట్‌మెంట్ చేపడుతున్నట్లు జీటీఎం సంస్థ ప్రతినిధి సతీష్‌రావు బుధవారం తెలిపారు. డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు fugojbrftm@fmai .com ఇమెయిల్ లేదా www.ftminternationa.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఉద్యోగ వివరాలు–ప్రయోజనాలు
క్లీనర్(300+ ఖాళీలు), ఏఈడీ 950 + ఉచిత భోజనం (నెలకు సుమారు రూ.26 వేలు), ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్, ఉచిత నియామక ప్రక్రియ. రోజుకు 9 గంటలు పని. 19 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగే సామర్థ్యం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు, వేదికలు
సెప్టెంబర్ 11 : సిరిసిల్ల, జగిత్యాల, ఉదయం 9 గంటల నుంచి..
సెప్టెంబర్ 12 : నిజామాబాద్, ఆర్మూర్‌లలో ఉదయం 9 గంటల నుంచి..
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
సిరిసిల్ల: 9347661522, జగిత్యాల: 8332016999, నిజామాబాద్: 8686860999, ఆర్మూర్: 8332013999.
ఉచిత నియామకాలు


