వేములవాడ: తమ మాతృసంస్థలకు బదిలీ చేయాలని కోరుతూ పలువురు ఆలయ ఉద్యోగులు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావుకు విన్నవించారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా బుధవారం వేములవాడకు చేరుకున్న కమిషనర్‌ను గెస్ట్‌హౌస్‌లో వేములవాడ, బాసర, కొండగట్టు ఆలయాల ఉద్యోగులు కలిశారు. తమ కష్టాలను ఏకరవు పెట్టుకున్నారు. ఈ విషయమై త్వరలోనే మంత్రితో మాట్టాడి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.
జగిత్యాల నుంచి పైరవీల జోరు
రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు గతంలో జగిత్యాల ఆర్డీవోగా విధులు నిర్వహించారు. దీంతో అక్కడి నాయకులు, ప్రముఖులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో పలువురు ఆలయ ఉద్యోగులు పైరవీలు పట్టుకున్నారు. దీంతో కొంత మంది ప్రముఖులు బుధవారం వేములవాడకు చేరుకుని కమిషనర్‌తో తమకు సంబంధించిన వారిని బదిలీ చేయాలని పైరవీలు చేపట్టారు.
దేవాదాయశాఖ కమిషనర్‌కు విన్నవించిన ఉద్యోగులు


