వేములవాడ: వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె చెల్లించాలంటూ ఇంటి యజమాని పంపరి దేవయ్య తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి బైఠాయించారు. బుధవారం ఉదయం అధికారులు, సిబ్బంది రాకముందే తాళాలు వేశారు. స్థానిక ఓల్డ్ అర్బన్‌కాలనీలోని పంపరి దేవయ్య ఇంటిలో పదిహేనేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొనసాగుతోంది. ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాలు, ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లాలని ఆదేశించడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను మార్కెట్‌యార్డుకు మార్చుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఖాళీ చేసే పని చేస్తున్నారు. అద్దె రూ.60 వేలు, కరెంట్ బిల్లు రూ.2 లక్షలు బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించిన తర్వాతనే సామగ్రి తీసుకెళ్లాలని ఇంటి యజమాని ఆఫీస్ ఎదుట బైఠాయించారు. అయితే ఓ నాయకుడి ద్వారా ఒప్పందం కుదుర్చుకుని ఎట్టకేలకు అధికారులు కార్యాలయంలోని సామగ్రిని మార్కెట్‌యార్డులోని నూతన కార్యాలయానికి షిఫ్ట్ చేశారు.
అద్దె చెల్లించి ఖాళీ చేయాలని యజమాని బైఠాయింపు


