● సీనియర్ ఫొటోగ్రాఫర్ నేత్రదానం
కోల్‌సిటీ: సు మారు నాలు గు దశాబ్దాల క్రితం కెమెరా పట్టుకుని గోదావరిఖనికి వచ్చిన ఆయన.. లెన్స్‌తో వేలాది జ్ఞాపకాలు పదిలపర్చారు. మరణానంతరం తనకళ్లతో మరోఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపారు గోదావరిఖనికి చెందిన ఏకశిల ఫొటో స్టూడియో నిర్వాహకుడు చందనాల వీరస్వామి(76). ఆయన అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు అవగాహన కల్పించగా.. వీరస్వామి నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. 1976లో వరంగల్ నుంచి గోదావరిఖనికి వలస వచ్చిన వీరస్వామి.. కల్యాణ్‌నగర్‌లో ఏకశిల ఫొటో స్టూడియో, ఫొటో ఫ్రేమ్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్.. వీరస్వామి కుటుంబసభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యతోపాటు కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు నివాళి అర్పించారు.


