కోరుట్ల: కుల సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణ శివారులోని కోనరావుపేట రోడ్డులో నిర్మించిన పద్మశాలీ కులోన్నతి సంఘం భవనాన్ని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రారంభించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పద్మశాలీ సంఘం భవనానికి ప్రభుత్వ స్థలం, నిధులు కేటాయించామని విద్యాసాగర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, నాయకులు జిల్లా ధనుంజయ్, రుద్ర శ్రీనివాస్, గడ్డం మధు పాల్గొన్నారు.


