జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డీసీసీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. రైతులకు భరోసా, మహిళలకు సాధికారత, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం, మౌలిక వసతుల నిర్మాణంతో బలమైన పునాదులు పడుతున్నాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, గంగారెడ్డి, గిరి నాగభూషణం, శ్రీనివాస్, జ్యోతి, కూసరి అనిల్ పాల్గొన్నారు.


