జగిత్యాలరూరల్: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీ లన పారదర్శకంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ అన్నారు. జగిత్యాల మండలం మోతె గ్రామంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చిన దరఖాస్తులు, వాటి స్థలాలను మంగళవారం పరిశీలించారు. లేఅవుట్‌కు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. పొరపాట్లకు తావులేకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరి శీలించాలన్నారు. వివరాలను టీపీవో శ్రీని వా స్, ఎంపీవో వాసవిని అడిగి తెలుసుకున్నారు.
నూకపల్లి పాఠశాలను పరిశీలించిన డీఈవో
మల్యాల: మండలంలోని నూకపల్లి ప్రాథమిక పాఠశాలను డీఈవో రాము మంగళవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారిలోని ఎఫ్‌ఎల్‌ఎన్ సామర్థ్యం, రెమెడియేషన్ తరగతులపై ఆరా తీశారు. అకడమిక్ మానిటరింగ్ అధికారి చంద్రశేఖర్, ఎంఈవో జయసింహారావు ఉన్నారు.
9 నుంచి మండలస్థాయి క్రీడా పోటీలు
ఈనెల 9 నుంచి 11వరకు మండలస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో తెలిపారు. తాటిపల్లి బాలికల గురుకులంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కంటిచూపుపై శ్రద్ధ చూపాలి
జగిత్యాల: విద్యార్థులు కంటిచూపుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌వో సుజాత అన్నా రు. అంధత్వ నివారణ సమితి ఆధ్వర్యంలో ప్ర భుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలో ని ప్రభుత్వ పాఠశాలల్లో 41,290 మందికి ఉచి త కంటి పరీక్షలు నిర్వహించి మొదటి విడతలో 740 మందికి అద్దాలు అందించామన్నారు. రెండోవిడత 1389 మందికి ఇస్తామన్నారు. మొబైల్స్ ఎక్కువగా చూడొద్దన్నారు. అంధత్వ నివారణ అధికారి రాజేందర్‌రెడ్డి, డీపీవో రవీందర్, వైద్యులు లక్ష్మీనారాయణ, విద్య, సురేంద్ర పాల్గొన్నారు.
జిల్లాకు ముగ్గురు లైవ్‌స్టాక్ ఆఫీసర్లు
జగిత్యాల: పశుసంవర్థక శాఖలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ముగ్గురికి లైవ్‌స్టాక్ ఆఫీసర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేయగా.. మంగళవారం జిల్లా పశువైద్యాధికారి బొల్లం ప్రకాశ్ వీరికి ప్రొసీడింగ్ కాపీలు అందించారు. మల్యాల మండలం రాంపూర్‌లో పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్‌బాబు సారంగాపూర్ మండలం రేచపల్లి ఉపకేంద్రానికి, ఆసిఫాబాద్ నుంచి మాధవరావు ఇబ్రహీంపట్నం మండలం గోధూరుకు, నిజామాబాద్ నుంచి పి.సురేశ్ కోరుట్ల మండలం పైడిమడుగుకు వీఎల్‌వోలుగా పదోన్నతిపై నియమితులయ్యారు. వీరిని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్, వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్, సూపరింటెండెంట్ అశోక్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శైలజ అభినందించారు.
సొంతంగా డ్రైనేజీ నిర్మాణం
జగిత్యాల: అది జిల్లాకేంద్రంలోని 45వ వార్డు. అక్కడ డ్రైనేజీ నిర్మించాలని కాలనీవాసులు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం డ్రైనేజీ నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభించలేదు. చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యేను కోరినా పట్టించుకోకపోవడంతో కాలనీవాసులు కొందరు ముందుకొచ్చి వారివారి ఇళ్ల ముందు డ్రై నేజీ నిర్మించుకుంటున్నారు. పన్నులు కట్టకుంటే మున్సిపల్ అధికారులు ఊరుకుంటారా..? అని ప్రశ్నిస్తూనే ప్రజల సమస్యలను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు.


