పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించండి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించండి

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

● టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్‌ విద్రోహ దినం ● కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళన

జగిత్యాల: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీఈజేఏసీ జిల్లా కన్వీనర్‌ కందుకూరి రవిబాబు, చైర్మన్‌ మిర్యాల నాగేందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 2004 సెప్టెంబర్‌ ఒకటిన అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షన్‌ హక్కులను హరించాయని గుర్తు చేశారు. 35 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగికి పెన్షన్‌ రాకపోవడం దారుణమన్నారు. అమరేందర్‌రెడ్డి, వకీల్‌, హరి అశోక్‌కుమార్‌, బైరం హరికిరణ్‌, శ్యామ్‌సుందర్‌, శివరామకృష్ణ, రాంచంద్రం, అరుణ, లావణ్య, అశోక్‌రాజు, రవిచంద్ర పాల్గొన్నారు.

నల్లబ్యాడ్జీలతో నిరసన

పెన్షన్‌ విద్రోహదినం సందర్భంగా ఎస్‌కేఎన్‌ఆర్‌ క ళాశాలలో అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్‌కు ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. నాయకులు నరేందర్‌రెడ్డి, బుదారపు శ్రీహరి, నాగభూషణం, విజేందర్‌రావు పాల్గొన్నారు.

మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన

జగిత్యాలరూరల్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సూపరింటెండెంట్‌ గంగాధర్‌, శ్రీనివాస్‌రావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సామూహిక సెలవు పెట్టాలి

ధర్మపురి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 17న సామూహిక సెలవులు పెట్టేందుకు అందరూ ముందుకు రావాలని సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌ సూచించారు. మండలంలోని కమలాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం పెన్షన్‌ విద్రోహ దినంగా పాటించి నల్లబ్యాడ్జీలు ధరించారు. ఏళ్ల తరబడి పోరాడుతున్నా.. సీపీఎస్‌ రద్దు చేయకపోవడం దారుణమన్నారు. ఉపాధ్యాయులు మెరుగు రమేశ్‌, ఎదుల మహేష్‌, సంద వెంకటేష్‌ బొమ్మల ప్రీతి, తేజ, సృజన తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement