● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ధర్మపురి బీఆర్‌ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా వారి వైఫల్యాలను ఎండగట్టేందుకు కేటీఆర్ ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, మహిళలకు నిరుద్యోగ భృతి ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు.


