● పకడ్బందీ ఏర్పాట్లు ● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నీట్‌పీజీ ప్రవేశ పరీక్షను ఆదివారం నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జేఎన్‌టీయూ(కొండగట్టు)లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, ఉదయం 7 నుంచి 8.30గంటల వరకు ఎగ్జామ్ సెంటర్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్, సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
నేత్రదానం గొప్పది
జగిత్యాలరూరల్: నేత్రదానం గొప్పదని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ జెడ్పీ పాఠశాలలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు. కంటిజబ్బులపై ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కంటి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఏ కారణంతో చనిపోయినా నేత్రాలు దానం చేయాలని, తద్వారా మరొకరి కంటి చూపు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్‌బీఎస్‌కే మెడికల్ ఆఫీసర్ సురేంద్ర, నేత్ర వైద్యులు తిరుపతి, లక్ష్మీనారాయణ, హెచ్‌ఎం రమేశ్ పాల్గొన్నారు.
అంజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వా రిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ ఏఈవో హరిహరనాథ్, ప్రధాన అర్చకులు జితేందర్ స్వామి, స్థానాచార్యులు కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, రామచంద్రం పాల్గొన్నారు.
అటవీశాఖ డీఆర్వో సస్పెన్షన్
జగిత్యాలక్రైం: అటవీశాఖ కార్యాలయంలో డీఆర్వోగా పనిచేస్తున్న మహేశ్‌ను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ కన్జర్వేటర్ అర్పన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్‌ఆర్వో పద్మారావు తెలిపా రు. మహేశ్‌పై పలు ఫిర్యాదులు రావడంతో పాటు నాలుగు రోజుల క్రితం మల్లాపూర్ మండలంలోని ఓ దాబాలో అటవీశాఖ అధికారులు కొంతమంది మద్యం సేవిస్తూ విందు చేసుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టి మహేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరోగ్య హబ్‌కు రక్తదాతలే కీలకం
జగిత్యాల: ఆరోగ్య హబ్‌కు రక్తదాతలే కీలకమని ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ అన్నారు. ఐఎంఏ హాల్‌లో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. రక్తదానం ఎంతో గొప్పదని, ఇది అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యదర్శి ఆకుతోట శ్రీ నివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వైద్యరంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించే హబ్‌గా రూపొందించడంలో ఐఎంఏ కీ లక పాత్ర పోషిస్తుందన్నారు. 22 మంది రక్తదానం చేశారు. మైత్రిరెడ్డి పాల్గొన్నారు.
అన్ని కేటగిరీలకు ఉత్తమ
అవార్డులు ప్రకటించాలి
జగిత్యాల: ఉత్తమ అవార్డుల ఎంపికలో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో డీఈవో రాము కు వినతిపత్రం అందజేశారు. 2026–27 వి ద్యా సంవత్సరానికి జిల్లాస్థాయి నుంచి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి దరఖా స్తులు ఆహ్వానించారని, ప్రధానోపాధ్యాయులు, అన్ని కేటగిరీల వారిగా మండలానికొకటి అవార్డు కేటాయించాలన్నారు. గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా ప్రభావితం చేయగల వ్యక్తులు కాకుండా తటస్థంగా, పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు తిరుకోవెల శ్యామ్‌సుందర్, గట్ల సంతోష్, ఎడ్ల గోవర్దన్ పాల్గొన్నారు.


