16 శాతం కమీషన్‌తో కాంట్రాక్టర్లు విలవిల రేవంత్, భట్టి వెనుక తిరిగేవాళ్లకే బిల్లులు కేంద్ర జలసంఘం నివేదిక రేవంత్‌కు చెంప పెట్టు కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పాలన దొంగలరాజ్యంగా మారిందని, 16శాతం కమీషన్ ఇచ్చి.. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో శనివా రం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి వె య్యిరోజులు గడుస్తున్నా ఎందుకు అమలు చేయ డం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలనూ తుంగలో తొక్కడం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ వై ఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీరు ఎత్తి పోసే అవకాశం ఉ న్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే రేవంత్ పాలనలో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. రైతుబీమా పథకాన్ని కనుమరుగు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లాడో తెలియదుగానీ తనకు కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం కల్పించాడని సంతోషం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ పేరిట ఆక్రమించిన మున్సిపల్ భూమిని కాపాడాలని ఎమ్మెల్యేకు సూచించారు. ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం చేసే అధికారం అధికారులకు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుస్తుంటే.. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హవా సాగుతోందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 2 నుంచి నిర్వహించే పార్టీ నిరసన కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు సమష్టిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.


