ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆయుధమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. సారంగాపూర్‌ రైతువేదికలో ఎస్‌ఐఆర్‌పై అవగాహ న కల్పించారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం 6, అభ్యంతరాలకు ఫారం 7, ఓటరు లిస్ట్‌ సవరణకు ఫారం 8 తప్పనిసరి అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 81 వేల ఓట్లు ఎస్‌ఐఆర్‌లో నమోదు కాలేదన్నారు. ఓటు లేనివారు సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని బీఎల్వోలకు అందజేయాలన్నారు. అనంతరం 23 మంది లబ్ధిదారులకు రూ.9.28లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ వాహిద్‌, ఎంపీడీవో నీరజ, సింగిల్‌ విండో చైర్మన్‌ నర్సింహారెడ్డి, సర్పంచులు అరుణ, సొల్లు సురేందర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, నాయకులు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన డీఈ

ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈగా బాధ్యతలు చేపట్టిన జలేందర్‌రెడ్డి శనివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఈలు రాజశేఖర్‌, తరుణ్‌, రాహూల్‌ పాల్గొన్నారు.

యువత క్రీడల్లో ముందుండాలి.

జగిత్యాలటౌన్‌: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో బాలబాలికలకు వాలీబాల్‌, కబడ్డీ ఉద్యోగులకు బాడ్మింటన్‌, క్రికెట్‌ పోటీలు నిర్వహించినట్లు క్రీడల అధికారి రవికుమార్‌ తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, కమిషనర్‌ సత్యప్రణవ్‌, ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి చక్రధర్‌రావు, పీడీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement