ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధం ఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని ఆగమశాస్త్రం ప్రకారం చేపడతామని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంపై శనివారం వేదపండితులు, అధికారులతో ఆలయ ప్రాంగణంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. వేదపండితులు తమ అభిప్రాయాలను వివరించారు. మంత్రి మాట్లాడుతూ ఉగ్ర నృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాకి ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని, భక్తుల మనోభావాల ప్రకారం పనులు చేపడతామని తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు మాట్లాడుతూ రూ.10 కోట్లతో ఆలయ ప్రతిష్టతకు ఎలాంటి భంగమూ కలగకుండా చూస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అంబేడ్కర్ సంఘం భవనాలు పూర్తి చేస్తాం
గొల్లపల్లి: జిల్లాలోని అంబేడ్కర్ సంఘం భవనాలు పూర్తి చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని దట్నూర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. ప్రపంచం కొనియాడిన మేధావి అంబేడ్కర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. దట్నూరు బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చా రు. సర్పంచ్ బెక్కం గంగారాం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపల్లి గంగన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, గ్రంథాలయ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర్‌రావు, అంబేడ్కర్ సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమాడ్లు, వివిధ గ్రామాల సర్పంచులు, అంబేడ్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రూ.10కోట్లతో పనులు చేపడతాం
సమీక్ష సమావేశంలో మంత్రి అడ్లూరి


