● బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది ● మాజీమంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాలటౌన్: ఆర్నెళ్లలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. డీఏలు, పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు, యువతతో పెట్టుకున్న వారు కనుమరుగయ్యారని, అదే గతి రేవంత్‌కు పట్టనుందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. స్మార్ట్‌రేషన్‌కార్డు కాంగ్రెస్ సభ్యత్వ కార్డుగా మారిందన్నారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, దావ వసంత, జేఏసీ నాయకులు నాగేందర్, రవిబాబు, రామచంద్రం, బైరం హరికిరణ్ పాల్గొన్నారు.


