జోరుగా జీరో మద్యం | - | Sakshi
Sakshi News home page

జోరుగా జీరో మద్యం

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

● కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువ పన్నులు విధించడంతో అక్కడ మద్యం అత్యంత చౌక ధరకే దొరుకుతోంది. ● అధికారులు పట్టుకున్న దానిలో ఆ ప్రాంతం నుంచి జిల్లాకు తరలిస్తున్న ఇంపీరియల్‌బ్లూ(ఐబీ) ఫుల్‌బాటిల్‌ ఇక్కడ రూ.760 ఉంటే.. అక్కడ కేవలం రూ.320కే లభిస్తోంది. ● ఇలా ఇక్కడ దొరికే ఏ బ్రాండ్‌ అయినా అక్కడ సగం కంటే తక్కువ ధరకే లభిస్తుండడంతో అధిక లాభం కోసం కొందరు అక్కడి నుంచి మద్యాన్ని ఇక్కడకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ● గురువారం పట్టుబడిన వాహనంలో మద్యం తరలించేందుకు చేసిన ప్రత్యేక ఏర్పాట్లను చూ సి ఎకై ్సజ్‌ అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. ● మద్యం బాక్సులు కనిపించకుండా వాహనం లోపల ప్రత్యేకంగా ర్యాకుల (ఆరలు)ను ఏర్పాటు చేశారు. ● తనిఖీల సమయంలో అధికారుల కంటపడకుండా ఈ ర్యాకుల్లో మద్యాన్ని పెట్టి రవాణా చేస్తున్నారు. ● చాలాకాలం నుంచి ఈ దందా చేస్తున్న అక్రమ రవాణాదారులు.. పకడ్బందీ ప్రణాళికతో ఎక్కడా పట్టుబడకుండా జిల్లాకు మద్యాన్ని తరలిస్తూ వస్తున్నారు. ● ఈనెల 14న కథలాపూర్‌ మండలంలో మద్యాన్ని పట్టుకున్న తర్వాత ఎకై ్సజ్‌ అధికారులు ఈ దందాపై పూర్తి నిఘా పెట్టారు. తాజాగా పక్కా సమాచారంతో మరోసారి అదే మండలంలో పట్టుకొని అక్రమ రవాణాదారుల గుట్టును రట్టు చేశారు. ● జీరో మద్యాన్ని పసిగట్టి పట్టించింది మెట్‌పల్లి ఎకై ్సజ్‌ పరిధిలోని కొందరు లైసెన్స్‌డ్‌ మద్యం వ్యాపారులేనని ప్రచారం జరుగుతోంది. ● కథలాపూర్‌ మండలంలోని కొందరు బెల్టు దుకాణాల నిర్వాహకులు కొన్నిరోజులుగా లైసెన్స్‌ దుకాణాల నుంచి తీసుకునే మద్యాన్ని బాగా తగ్గించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దీనిపై ఆరా తీసిన వ్యాపారులు.. వారంతా ఎక్కువగా జీరో మద్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించి విషయాన్ని ఎకై ్సజ్‌ అధికారులకు చేరవేసినట్లు సమాచారం. ● దీంతో ఎకై ్సజ్‌ అధికారులు అప్రమత్తమై నిఘా పెట్టడంతో జీరో దందా బట్టబయలైంది. ● జీరో మద్యం వ్యవహారంలో గతంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎకై ్సజ్‌ పోలీసులు.. తాజాగా మహారాష్ట్రకు చెందిన శ్రీగిరి ప్రవీణ్‌, ప్రదీప్‌ జైశ్వాల్‌, అజయ్‌ను పట్టుకొని కేసు నమోదు చేశారు. ● ఓ వాహనంతోపాటు వారి నుంచి రూ.6.38లక్షల మద్యం, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కేంద్రపాలిత ప్రాంతాల నుంచి జిల్లాకు తరలింపు అక్కడ తక్కువ ధరకు దొరకడమే కారణం 15 రోజుల్లో రూ.9లక్షల మద్యం పట్టివేత అధికారులకు చిక్కకుండా వాహనంలో ర్యాకుల ఏర్పాటు

మెట్‌పల్లి: జిల్లాలో జీరోమద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర పాలితప్రాంతమైన దాద్రానగర్‌, హవేలీ, డయ్యూడామన్‌లో తక్కువ ధరకు దొరికే మద్యాన్ని కొనుగోలు చేసి.. అత్యంత పకడ్బందీగా జిల్లాకు తరలిస్తున్నారు. ఇక్కడి బెల్ట్‌ దుకాణాల్లో ఆ మద్యాన్ని విక్రయిస్తూ పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు. కథలాపూర్‌ మండలంలో ఎకై ్సజ్‌ అధికారులు పదిరోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో రూ.2.50లక్షల మద్యం పట్టుకున్నారు. తాజాగా గురువారం చేపట్టిన తనిఖీల్లో ఏకంగా రూ.6.38లక్షల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. విచ్చలవిడిగా సాగుతున్న ఈ అక్రమ దందాతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఫలితంగా జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇక్కడ రూ.760, అక్కడ రూ.320మాత్రమే

మద్యం కనిపించకుండా ఏర్పాట్లు

పసిగట్టి పట్టించింది లైసెన్స్‌డ్‌ వ్యాపారులే?

ఐదుగురిపై కేసు

దాబా, బెల్టుషాపుల్లో కల్తీ మద్యం

జగిత్యాలక్రైం: కథలాపూర్‌, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాల్లో దాబాలు, బెల్టుషాపుల్లో విలు వైన మద్యాన్ని బాటిళ్ల నుంచి తీసి తక్కువ రేటు ఉన్న మద్యాన్ని ఆ బాటిళ్లలో నింపి తిరిగి సీల్‌ చేస్తున్నారు. విలువైన బ్రాండ్లను కూడా తక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. రానున్న దసరా పండగ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం అమ్మకాలు పడిపోకుండా ఎకై ్సజ్‌ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం జిల్లాలోకి రాకుండా కట్టడి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement