ఓట్లపై అభ్యంతరాలు ఉంటే తెలపండి | - | Sakshi
Sakshi News home page

ఓట్లపై అభ్యంతరాలు ఉంటే తెలపండి

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

ఇబ్రహీంపట్నం: తొలగించిన ఓట్లపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఎస్‌ఐర్‌పై గ్రామసభలో మాట్లాడారు. బీఎల్‌వోలు తమ పరిధిలోని పోలింగ్‌ బూత్‌లలో తొలగించిన ఓటర్ల వివరాలను చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మ్యాపింగ్‌ కాని ఓటర్లకు నోటీసులు అందించినట్లు తెలిపారు. కొన్ని పొరబాట్లు ఉన్నవాటిని తొలగించామని, అలాంటి వారికి నోటీసులు అందించామని, 12 రకాల ఆధారాల్లో ఏదోఒకటి తీసుకొస్తే తిరిగి ఓటర్‌గా నమోదు చేస్తామని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. అనంతరం బర్దీపూర్‌లో భూభారతి భూరీసర్వే పనులను పరిశీలించారు. అసైన్‌మెంట్‌ భూమి వివరాలను తెలుసుకున్నారు. పునరావాస గ్రామం కావడంతో ఎస్సారెస్పీ అధికారులు రాకుండా సర్వే చేయొద్దని సూచించారు. ఇప్పటివరకు 960 ఎకరాలు సర్వే చేసినట్లు అధికారులు సమాధానం ఇచ్చారు. గ్రామంలో 376 సర్వేనంబర్‌లో 5.13ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా నకిలీ డి–1 ద్వారా పట్టా చేసుకున్నారని మాజీ సర్పంచ్‌ జనార్ధన్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన తీసుకోకపోవడంతో తహసీల్దార్‌ వరప్రసాద్‌కు ఇవ్వడం గమనార్హం. ఆర్‌డీవో నర్సింహారావు, ఎంపీడీవో చిప్ప గణేష్‌, ఎంపీవో రామకృష్ణ రాజు, ఆర్‌ఐలు రేవంత్‌రెడ్డి, రమేశ్‌, సర్పంచ్‌లు బద్దం గోపి, సంగం సాగర్‌, సింగిల్‌విండో చైర్మన్‌ జిల్లాల పవన్‌, బీఎల్‌వోలు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement