గుండె గూటి
ఇల్లంతకుంట: మాది ఇల్లంతకుంట. మా నాన్న నర్సయ్య అమ్మ లక్ష్మి. ఇద్దరు సోదరులు అనిల్, మహేశ్. అన్నయ్య బైరి అనిల్ 15ఏళ్లుగా ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. ఇంటి వద్ద ఉంటే ఇక్కడే రాఖీ కడతాను. ప్రస్తుతం అన్నయ్య పశ్చిమ బెంగాల్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వారం రోజుల క్రితమే రాఖీ పోస్ట్ చేశాను. గురువారం రాఖీ చేరిందని అన్నయ్య తెలిపాడు. – పెద్ది కవిత, ఇల్లంతకుంట
మెట్‌పల్లి: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్మ మధ్య ప్రేమ, అప్యాయత, అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తోంది. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పండుగ దోహాపడుతోంది.ఏటా మా సోదరి సమత నాకు రాఖీ కడుతోంది. వైద్య వృత్తిలో తాను, రాజకీయాల్లో నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆ రోజున తప్పకుండా కలుసుకుంటాం.
– కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే


