కోరుట్ల: విద్యుత్ వినియోగానికి ప్రీపెయిడ్ విధానం తేవాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పార్టీ కోరుట్ల ఇన్‌చార్జి రఘు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, విద్యుత్ వినియోగానికి ముందుగానే డబ్బులు చెల్లించే ప్రీపెయిడ్ విధానాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ ముందుగానే రీచార్జ్ చేసుకుంటే సరఫరా జరిగే విధానం ప్రజలను ఇబ్బందుల్లో పడేయటమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


