తల్లిపాలు అమృతం | - | Sakshi
Sakshi News home page

తల్లిపాలు అమృతం

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

రెండేళ్లపాటు ఇస్తే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు ఈనెల ఏడోతేదీ వరకు వారోత్సవాలు

గొల్లపల్లి: మాతృత్వం ఒక అద్భుతమైన అనుభూ తి. నవమాసాలు మోయడంతోపాటు బిడ్డకు ఈ లోకాన్ని పరిచయం చేశాక మరింత భద్రంగా కాపాడుకోవడం ప్రధానం. శిశువుకు ఎంత మంచి పోషకాలు అందితే అంత దృఢంగా ఉంటారు. అయితే ఆ పోషకాలు ఒక్క తల్లిపాలలో మాత్రమే లభి స్తాయి. పిల్లల ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతంతో సమానం. ఉరుకులు, పరుగులు జీవితంలో చాలామంది తల్లులు పిల్లలను కా స్త నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరికొందరు తల్లులు కొన్ని అపోహలతో పిల్లలకు పాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి వారిలో అవగాహన కోసమే ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు వివిధ కార్యక్రమాల ద్వారా తల్లులకు అవగాహన కల్పిస్తోంది. తల్లిపాలలో ఉండే పోషకాలు.. ఇతరత్రా అంశాలను పరిశీలిస్తే..

అమృతధార ‘ముర్రుపాలు’

ప్రసవం సాధారణమైనా.. (నార్మల్‌), సిజేరియన్‌ అయినా సరే బిడ్డ పుట్టిన వెంటనే పాలు పట్టడం అత్యంత ఆవశ్యకం. ముర్రుపాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నారికి లభించే తొలి వ్యాక్సిన్‌. పాలల్లో విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బిడ్డకు అవసరమైన క్యాలరీలను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కొండంత పెంచుతాయి.

ఆర్నెళ్ల వరకు..

బిడ్డ పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. తర్వాత తగిన ఆహారంతోపాటు రెండేళ్ల వరకు పాలు ఇస్తే శిశువుకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. తల్లిపాలు చాలారోజులు తాగిన పిల్లల్లో శారీరక శక్తితో పాటు మానసిక వికాసం, మెదడు ఎదుగుదల అద్భుతంగా ఉంటాయి. డయేరియా, న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. భవిష్యత్తులో క్యాన్సర్‌, గుండెజబ్బులు, అలర్జీ, ఆస్తమా, డయాబెటిస్‌ వంటి సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఎముకలకు అవసరమైన కాల్షియం నిల్వ లను పెంచి, శరీరాన్ని బలంగా మారుస్తుంది.

తల్లికీ మేలే..

బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల శిశువుకే కాదు.. తల్లికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పాలు పట్టించడం వల్ల ప్రసవానంతరం తల్లి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది. రోజుకు 8 నుంచి 12సార్లు పిల్లలకు పాలు పట్టించాలి. తల్లి తగినంత విశ్రాంతి తీసుకుంటూ.. ఎక్కువ నీరు తాగుతూ, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement