బైక్‌ నంబరు మార్చేసుకున్నారు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ నంబరు మార్చేసుకున్నారు

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

● నకిలీ నంబరుతో తిరిగి పట్టుబడ్డారు

● నకిలీ నంబరుతో తిరిగి పట్టుబడ్డారు

పెద్దపల్లిరూరల్‌: రోడ్లపై తిరిగే బైక్‌ నంబర్లను టాంపరింగ్‌ చేసి ట్రాఫిక్‌ పోలీసులు విధించే చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు యత్నిస్తుంటే.. ఇంకొందరు ఏకంగా వాహన నంబరునే మార్చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం పెద్దపల్లిలో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖిల్లో నకిలీ నంబరు(టీఎస్‌ 19ఏ 9821)తో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌బైక్‌ తిరుగుతున్నట్టు గుర్తించి దానిని స్వాధీ నం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఇదే నంబరుగల బైక్‌ హైదరాబాద్‌లో ఉన్నట్టు తేలింది. ఇక్కడి ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ విధిస్తే ఆ నంబరు యజమాని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వెళ్తున్నాయి. నకిలీ నంబరు వినియోగిస్తున్న పెద్దపల్లిలోని కొంతంవాడకు చెందిన వీరేశంపై కేసు నమోదు చేశారు. ఈబైక్‌ య జమాని ఓ వ్యాపారి వద్ద కుదువపెట్టగా.. సదరు వ్యాపారి ఇలా బోగస్‌ నంబరుతో తిరిగాడని వీరేశం పోలీసులకు వివరించినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement