మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్‌నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాహిని షాపింగ్‌మాల్ సోమవారం సినీనటి క్రితిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఓంప్రకాశ్ జాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటి క్రితి శెట్టి మాట్లాడుతూ.. వాహిని షాపింగ్‌మాల్‌లో వైరెటీ చీరలు, చిన్న పిల్లల బట్టలు, మెన్స్‌వేర్ చాలా వైరెటీలు ఉన్నాయన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా వాహిని షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేయాలని కోరారు. వాహిని షాపింగ్ మాల్‌లో కస్టమర్లకు మంచి ఆఫర్లను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని నగర, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమాని వేముల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, అనిల్, ప్రశాంత్, శ్రీనివాస్, విష్ణు, వేణుగోపాల్ జాజు, నవనీత్ బంగ్, శ్రీరామ్ జాజు, దేవరాజు, నాగరాజు, నటరాజ్, నందరాజ్, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్ పాల్గొన్నారు.


