జగిత్యాలజోన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆ మేరకు కష్టపడాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతోపాటు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని కోరారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విజయకృష్ణ, అనురాధ పాల్గొన్నారు.


