జగిత్యాలరూరల్: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోళ్లవాగు నీరు వృథాగా పోతోందని, గేట్లు బిగించడంలో అధికారులు విఫలం కావడంతో రైతులు, మత్స్యకారులు నష్టపోతున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బీర్‌పూర్‌లోని రోళ్లవాగును జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంతతో కలిసి శనివారం పరిశీలించారు. రోళ్లవాగు సామర్థ్యం 0.25 టీఎంసీ కాగా.. కేసీఆర్ ఒక టీఎంసీకి పెంచారని గుర్తు చేశారు. యాసంగి సీజన్‌లోనే గేట్లు అమరుస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో వర్షాలకు వచ్చిన నీరు వృథాగా పోతోందన్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బాధ్యత వహించాలన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తాటిపర్తి చంద్రకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, మాజీ ఎంపీపీ మసర్థి రమేశ్, సుమన్, సుభాష్‌యాదవ్, సత్యంరావు, జితేందర్‌యాదవ్, ముక్క శంకర్, ఆకుల రమేశ్, వీరేశ్, ఆకుల రాజిరెడ్డి, తేలు రాజు, రిక్కల ప్రభాకర్, చిక్కుల రవి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కారును ఢీకొన్న ఆటో.. ఒకరికి తీవ్రగాయాలు
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి శివారులో జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై కారును ఆటో ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్‌కు చెందిన వ్యక్తి తన ఆటోలో బ్లాంకెట్స్ విక్రయించేందుకు బయల్దేరాడు. కారు నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఆటో డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. కారు కూడా దెబ్బతింది. ఆటో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.


